ఆఖరిగా అదిరిపోయే మల్టీస్టారర్‌కు రాఘవేంద్రరావు ప్లాన్?


పక్షవాతం.. శరీరం బిగుసుకు పోవడం, ముఖం వంకర్లు తిరగడం, కాళ్ళు చేతులు చచ్చు పడి పోవడం పక్షవాతం లక్షణాలు. ఈ వ్యాధితో బాధ పడేవారి కష్టాలు వర్ణనాతీతం. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అత్యాధునిక లేజర్ టెక్నలాజి అందుబాటులో ఉన్నప్పటికీ.. పూర్తిగా నయం చేస్తామని గ్యారెంటీ ఇవ్వలేని స్థితి. అయితే.. కర్నూలు జిల్లాలో తన తండ్రి నుండి నేర్చుకున్న హరిబాబు అనే వ్యక్తి చేసే పసరు వైద్యంతో.. మూడు నెలలలోనే పక్షవాతం పరిగెత్తుతుంది.

నంద్యాల నుండి కోవెల కుంట్లకు వెళ్లే మార్గంలో ఉన్న ఉమాపతి నగర్ నిత్యం పక్షవాతం రోగులతో కిక్కిరిసి పోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, మాహారాష్ట్ర నుండి ఎందరో పసరు వైద్యం కోసం వస్తూ ఉంటారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చికిత్స అందిస్తారు. కేవలం పసరు మందుతో ఎందరికో పక్షవాతం నుండి విముక్తి కలిగిస్తున్నారు. పసరు మందు తీసుకునే వారిని మూడు రోజుల పాటు ఇక్కడే ఉంచుతారు. ముందుకు ఎలాంటి ఫీజు తీసుకోరు.

ఇక చికిత్స సంగతికి వస్తే.. మొదటి రోజు వెల్లుల్లి ని రోలో దంచి రసం తీస్తారు. అందులో బెల్లం కలిపి తీసుకుంటారు. ఇక రెండో రోజు తాను తయారు చేసిన రసాన్ని రోగి చెవిలో పోస్తారు. వ్యాధి తీవ్రతని బట్టి పసరు తయారు చేస్తారు. చివరి రోజు కంట్లో మందు వేస్తారు. పసరు తీసుకున్న వాళ్ళు మూడు నెలల దాకా పత్యం పాటించాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో వెల్లుల్లి కారం, ఆవు నెయ్యితో మాత్రమే అన్నం తినాలి. వైద్యుడు ఇచ్చిన తైలంతో చచ్చుబడిన కాళ్ళు, చేతులు, ముఖానికి మర్దన చేసుకోవాలి. కార్పొరేట్ ఆసుపత్రి కి తిరిగినా నయం కానిది.. ఇక్కడ నయం చేశారని అక్కడ చికిత్స పొందినవారు చెబుతున్నారు.కె. రాఘవేంద్రరావు.. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. తన మార్క్ టేకింగ్ చిన్న చిత్రాలకు కూడా పెద్ద విజయాలు అందించడంలో ఆయన సిద్ధహస్తుడు. తెలుగు తెరకు భారీతనం అద్దిన తొలి దర్శకుడిగా కూడా రాఘవేంద్రరావును చెప్పుకోవచ్చు. రాఘవేంద్రుని సినిమా అంటేనే పంచభక్ష పరమాన్నం. మల్టీస్టారర్ చిత్రా రూపకల్పనలో ఆయన రూటే సెపరేట్. గతంలో ఇద్దరు స్టార్ హీరోలతో.. హీరోయిన్‌లతో మల్టీస్టారర్ చిత్రాలను తీసిన రాఘవేంద్రరావు తెలుగు సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని మల్టీస్టారర్‌కు తెరతీయనున్నట్లు తెలుస్తోంది. శతాధిక చిత్రాల మైలు రాయిని దాటిన రాఘవేంద్రరావు ఈ మధ్య భక్తిరస చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న మరో భక్తిరస కావ్యం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ సినిమాతో ఇక దర్శకత్వానికి స్వస్తి చెప్పాలని దర్శకేంద్రుడు నిర్ణయించుకున్నారట.

అయితే ఈ విషయంలో ఆయనకు ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వస్తోందట. ఎవర్‌గ్రీన్ యంగ్ దర్శకులు మీరు. ఇలా సినిమాలు మానేస్తే ఎలా? అంటూ రిక్వెస్ట్‌ల మీద రిక్వెస్ట్‌లు వస్తున్నాయట. అయినా రాఘవేంద్రుడు తన మనస్సు మార్చుకునే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది. ఇందుకు పరిష్కారంగా రాఘవేంద్రునికి సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ అగ్రహీరో ‘‘ఎంత చెప్పినా మీరు వినడం లేదు కాబట్టి.. మీ చివరి చిత్రంగా ఓ మల్టీస్టారర్ చేయండి. అందులో ఒకరు ఇద్దరు కాదు.. మన తెలుగు పరిశ్రమలో ఉన్న హీరోల్లో వీలైనంత మందికి క్యారెక్టర్‌లు ఉండేలా కథ సిద్ధం చేసుకోండి. అందరూ ఇష్టంగా ముందుకు వస్తారు. కావాలంటే నేను బాధ్యత తీసుకుంటాను. క్యారెక్టర్ సెట్ కానివాళ్లు ఒక్క సీన్‌లో అయినా కనపడేలా చూడండి. ప్రపంచంలో ఇలాంటి మల్టీస్టారర్ ఎక్కడా రాకూడదు’’ అన్నారట. దానికి రాఘవేంద్రరావు నవ్వుతూ ‘‘ఆలోచిద్దాం’’ అన్నారని సమాచారం. ఒక వేళ రాఘవేంద్రుడు మొదలెట్టాలే గానీ.. అందులో భాగంగాని ఆర్టిస్ట్‌లు ఉంటారా?
DO YOU LIKE THIS ARTICLE


0 comments:

http://go.ad2upapp.com/afu.php?id=1114707