పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మరియు అధిక బరువు తగ్గాలంటే వేరుసెనగలని ఈ విధంగా తీసుకుంటే 2 వారాలలోనే….


ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుడా ప్రతి ఒక్కరికి శరీరంలో చెడు కొవ్వు పెరిగిపోతుంది. ఆతరువాత ఆ కొవ్వును తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడుతుంటారు. అయితే వేరుశెనలతో శరీరంలో పెరుగుతున్న చెడు కొవ్వుకి చెక్ పెట్టొచ్చు. వేరుశెనగల్లో క్యాల్షియం, ఫాస్పరస్ఇనుము, జింక్ బోరాన్లలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాదు.. ప్రాణాంతక వ్యాధులను కూడా వేరుశెనగలు దూరం చేస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులను దరి చేరనివ్వవు. వేరుశనగపప్పు లోని ఫైబర్ యాంటిఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు శరీర ఆరోగ్యానికి సహకరించడంతో ఆయుష్షును పెంచుతాయట.

వేరుశెనగలతో బరువు తగ్గడం ఎలాగా?
సాధారణంగా మనం ఇడ్లి లేదా దోశలలో పల్లి చట్నీ తింటాము అయితే అవి తినడం వల్ల బరువు తగ్గడం కష్టం మరి వేరుశెనగలతో బరువు ఎలా తగ్గుతారు? వేరుశెనగలను ఉడకబెట్టి తింటే బరువు తగ్గుతారు.అవును! వేరుశెనగలను వేయించి తింటే అది కొవ్వు పదార్ధంగా మారుతుంది.అదే ఉడకబెట్టి దానిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తింటే బరువు తొందరగా తగ్గుతారు. అలాగే దానిలో ఉల్లిపాయలు కారోట్ తురిమి వేసుకుని సాయంత్రం పూట అల్పాహారంగా తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు

రోజూ గుప్పెడు వేరుశెనగలు తీసుకోవడం ద్వారా కేన్సర్ ముప్పు తొలగుతుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు, ఆర్థరైటిస్ నివారణకూ ఉపయోగపడుతుంది. ఇది పొట్టచుట్టూ పేరుకున్న

కొవ్వును కరిగించేందుకు తోడ్పడుతుంది. ఈ పప్పులోని ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. పప్పుతోపాటు వేరుశనగ నూనె కూడా మంచిదే.

వేరుశెనగలను రోజువారీ డైట్లో తీసుకోవడం ద్వారా విటమిన్-ఇ, పాలీఫెనాల్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. పోషకాహార లోపం కారణంగా బలహీనంగా ఉండే పిల్లలకు వేరుశనగను మించి ఔషధం లేదు. అదే విధంగా గర్భిణులకు, బాలింతలకు మాంసకృత్తులు వీటినుంచి సమృద్ధిగా లభిస్తాయి. వేరుశనగతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
DO YOU LIKE THIS ARTICLE


        

0 comments:

http://go.ad2upapp.com/afu.php?id=1114707