కర్నూలు జిల్లాలో పక్షవాతానికి అద్భుత వైద్యం.. దయచేసి అందరికీ తెలియ చేయండి
పక్షవాతం.. శరీరం బిగుసుకు పోవడం, ముఖం వంకర్లు తిరగడం, కాళ్ళు చేతులు చచ్చు పడి పోవడం పక్షవాతం లక్షణాలు. ఈ వ్యాధితో బాధ పడేవారి కష్టాలు వర్ణనాతీతం. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అత్యాధునిక లేజర్ టెక్నలాజి అందుబాటులో ఉన్నప్పటికీ.. పూర్తిగా నయం చేస్తామని గ్యారెంటీ ఇవ్వలేని స్థితి. అయితే.. కర్నూలు జిల్లాలో తన తండ్రి నుండి నేర్చుకున్న హరిబాబు అనే వ్యక్తి చేసే పసరు వైద్యంతో.. మూడు నెలలలోనే పక్షవాతం పరిగెత్తుతుంది.
నంద్యాల నుండి కోవెల కుంట్లకు వెళ్లే మార్గంలో ఉన్న ఉమాపతి నగర్ నిత్యం పక్షవాతం రోగులతో కిక్కిరిసి పోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, మాహారాష్ట్ర నుండి ఎందరో పసరు వైద్యం కోసం వస్తూ ఉంటారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చికిత్స అందిస్తారు. కేవలం పసరు మందుతో ఎందరికో పక్షవాతం నుండి విముక్తి కలిగిస్తున్నారు. పసరు మందు తీసుకునే వారిని మూడు రోజుల పాటు ఇక్కడే ఉంచుతారు. ముందుకు ఎలాంటి ఫీజు తీసుకోరు.
ఇక చికిత్స సంగతికి వస్తే.. మొదటి రోజు వెల్లుల్లి ని రోలో దంచి రసం తీస్తారు. అందులో బెల్లం కలిపి తీసుకుంటారు. ఇక రెండో రోజు తాను తయారు చేసిన రసాన్ని రోగి చెవిలో పోస్తారు. వ్యాధి తీవ్రతని బట్టి పసరు తయారు చేస్తారు. చివరి రోజు కంట్లో మందు వేస్తారు. పసరు తీసుకున్న వాళ్ళు మూడు నెలల దాకా పత్యం పాటించాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో వెల్లుల్లి కారం, ఆవు నెయ్యితో మాత్రమే అన్నం తినాలి. వైద్యుడు ఇచ్చిన తైలంతో చచ్చుబడిన కాళ్ళు, చేతులు, ముఖానికి మర్దన చేసుకోవాలి. కార్పొరేట్ ఆసుపత్రి కి తిరిగినా నయం కానిది.. ఇక్కడ నయం చేశారని అక్కడ చికిత్స పొందినవారు చెబుతున్నారు.
DO YOU LIKE THIS ARTICLE:

0 comments: