‘కాటమరాయుడు’ ఇలా చేశాడేమిటి?


పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజాచిత్రం ‘కాటమరాయుడు’ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరద్ మరారు నిర్మాతగా, డాలీ దర్శకత్వంలో రూపొందుతోంది ఈ చిత్రం. సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా అభిమానులను నిరాశ పరచడంతో.. పవన్ అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని.. ఈ సారి గ్యారెంటీ హిట్ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మేరకు సంక్రాంతికి 'కాటమరాయుడు' టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే మిక్సింగ్ పూర్తి కాకపోవడంతో జనవరి 26న ముహూర్తం పెట్టారు. తాజా సమాచారం ప్రకారం గణతంత్ర దినోత్సవం రోజున కూడా ఈ టీజర్ విడుదల కావడంలేదట. తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమం స్పూర్తితో జనవరి 26న విశాఖ ఆర్కేబీచ్ ఒడ్డున నిర్వహించ తలపెట్టిన ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమం పవన్ కళ్యాణ్ బిజిగా ఉండడం వలన కూడా ఇది వాయిదా పడ్డట్లు తెలుస్తుంది. అంతే కాక టీజర్ పవన్ అనుకున్న రేంజ్‌లో లేకపోవడమే ఇందుకు కారణమనే గుసగుసలు వినపడుతున్నాయి.


0 comments:

http://go.ad2upapp.com/afu.php?id=1114707